నిబద్ధతకు నిలువుటద్దం “పవర్ ప్రభాకర్ రావు”

234
cmd prabhakarrao
- Advertisement -

విధి ఎంతో బలీయమైనది అంటే ఇదే మరి కష్టాల్లో ఉన్నప్పుడు, దుఖంతో ఉన్న వారికే మరింత కష్టం ఎదురు అవుతుంది.శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించిన ఘటన నుంచి ఇంకా కొలుకొక ముందే జెన్ కో సిఎండి ప్రభాకర్ రావుకు మరో విషాద పరిస్థితి ఏర్పడింది.

శ్రీశైలం బాధిత కుటుంబాలను కలుసుకుని వారికి కొండంత ధైర్యాన్ని ఇస్తున్న సమయంలో జెన్ కో సిఎండి ప్రభాకర్ రావుకు దేవుడు మరో పరీక్ష పెట్టాడు.ప్రభాకర్ రావు సోదరుడు శ్రీనివాస రావు(82) అనారోగ్యంతో మంగళవారం వరంగల్ లో మృతి చెందారు.

ఎంతో గుండె నిబ్బరంతో మంగళవారం మధ్యాహ్నం కన్నతోడును కాటికి చేర్చిన ఆయన బుధవారం ఉదయం తిరిగి శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాద స్థలానికి చేరుకున్నారు.తాను పనిచేసే విద్యుత్ రంగానికి ప్రాణం ఇచ్చే “పవర్ ప్రభాకర్ రావు” విద్యుత్ ఉద్యోగుల్ని కుటుంబ సభ్యులుగా భావిస్తారు.

తన అన్న మరణాన్ని గుండెల్లో దిగమింగుకుని భాధ్యతలకు ప్రాధాన్యత ఇస్తూ బుధవారం ఉదయం ఆయన శ్రీశైలానికి వెళ్ళారు.తన సోదరుడి మరణ వార్త కంటే తోటి ఉద్యోగులు ప్రమాదంలో మరణించడం ఆయన్ను ఎంతగానో ఆందోళనకు గురిచేసింది.

- Advertisement -