కోహ్లీపై ప్రశంసల జల్లు.. టీమిండియానే గ్రేట్‌..!

249
- Advertisement -

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగుతుందని క్రికెట్‌ అభిమానులు భావించారు. ముఖ్యంగా టీమిండియా ఫ్యాన్స్‌ తమ జట్టు విజయం కోసం పూజలు, హోమాలు, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కోహ్లి సేన విజయాన్ని కాంక్షిస్తూ మద్దతుగా సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ఊహించిన దానికి భిన్నంగా మ్యాచ్‌ ఏకపక్షంగా జరగడంతో ఫ్యాన్స్‌ నిరాశ చెందారు. దీంతో చాలా మంది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా, కొంత మంది క్రీడాస్ఫూర్తి కనబరిచారు.

ఆటలో గెలుపోటముల సహజమని, బాగా ఆడిన జట్టే గెలిచిందని పేర్కొన్నారు. అనూహ్యంగా పుంజుకుని విజేతగా నిలిచిన పాకిస్తాన్‌ జట్టుకు అభినందనలు తెలిపారు. చివరి మెట్టుపై బోల్తా పడిన కోహ్లి సేనకు బాసటగా నిలిచారు. గెలిచినా, ఓడినా టీమిండియాను అభిమానిస్తూనే ఉంటామన్నారు. ఒక్క మ్యాచ్‌ ఓడినంత మాత్రానా ద్వేషించాల్సిన పనిలేదని అభిప్రాయపడ్డారు.

All Praise For Virat Kohli

అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై పాక్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలుపుతూ… ‘జెంటిల్‌ మ్యాన్’ అంటూ కొనియాడుతున్నారు. ఐసీసీ ఛాంపియిన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌కి ముందు, ఆ తర్వాత ఓడిపోయినప్పుడూ… కోహ్లీ చేసిన వ్యాఖ్యలు వారిని అమితంగా ఆకట్టుకున్నాయి. 180 పరుగుల తేడాతో దారుణ పరాజయాన్ని పొందినప్పుడు సైతం… 28 యేళ్ల కోహ్లీ అత్యంత నిబ్బరంగా మాట్లాడడంపై క్రికెట్ వర్గాలు సైతం శెభాష్ అంటున్నాయి.

ఫైనల్ మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ జట్టుకు అభినందనలు చెప్పాలనుకుంటున్నాను. ఈ టోర్నమెంటులో వాళ్లు అద్భుతంగా ఆడారు. పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్న విధానం చూస్తేనే వారి ప్రతిభ ప్రతిధ్వనిస్తోంది. వాళ్లు మరోసారి దాన్ని రుజువు చేసుకున్నారు. వాళ్లకు అవకాశం వచ్చినప్పుడు ఎవరినైనా తలకిందులు చేయగలరు. ఫకార్ జమాన్ లాంటి వారు 80 శాతం పరుగులు అత్యంత రిస్క్ తీసుకుని చేయడంతో వారిని నిలువరించడం కష్టమైంది. ఈ ఓటమి మాకు నిరాశకలిగించే విషయమైనా… ఫైనల్‌కి చేరేందుకు మేము కూడా బాగా ఆడుతూ వచ్చాం. అందుకే నా ముఖంపై ఈ మాత్రమైనా చిరునవ్వు కనిపిస్తోంది.. కొన్నిసార్లు మనం ప్రత్యర్థి ప్రతిభను కూడా సంతోషంగా ఒప్పుకోవాలి’’ అని పేర్కొన్నాడు.

All Praise For Virat Kohli

టీమిండియా కెప్టెన్ వ్యాఖ్యలపై పాక్ అభిమాని ఒకరు ట్విటర్లో స్పందిస్తూ… ‘‘మా పట్ల స్నేహపూర్వకంగా మాట్లాడినందుకు విరాట్ కోహ్లీకి కృతజ్ఞతలు. టీమిండియా… మీరు నిజంగా మంచి జట్టు… ప్రపంచ ఛాంపియన్ల నుంచి విజయం అందుకోవడం గౌరవంగా భావిస్తున్నాం…’’ అని వ్యాఖ్యానించింది. మరో వ్యక్తి ట్వీట్ చేస్తూ… ‘‘ తన వ్యాఖ్యలతో కోహ్లీ అనేకమంది హృదయాలను గెలుచుకున్నాడు. ఆయనకు కృతజ్ఞతలు. నువ్వు చాలా గొప్ప ఆటగాడివి… గొప్ప మనసున్న జెంటిల్‌మ్యాన్‌వి కూడా..’’ అని పేర్కొన్నారు. ‘‘విరాట్ చాలా గొప్పగా మాట్లాడాడు. ఇవాళ క్రికెట్, దౌత్యం రెండూ గెలిచాయి’’ మరో యువతి స్పందించింది. మెక్ కల్లం, షేన్‌వార్న్ వంటి సీనియర్ క్రికెటర్లు సహా… అనేకమంది నెటిజన్లు టీమిండియా కెప్టెన్‌పై తమ అభిమానం చాటుకున్నారు.

All Praise For Virat Kohli

All Praise For Virat Kohli

- Advertisement -