డిసెంబర్ 2న గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొనండి

342
Allam Narayana
- Advertisement -

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించిన హరిత హారం కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకుని ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో భాగంగా డిసెంబర్, 2వ తేదీ సోమవారం ఉదయం 10-30 గంటలకు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, టీయూడబ్ల్యూజె సంయుక్త ఆధ్వర్యంలో బంజారాహిల్స్ ఎమ్మేల్యే కాలనీ, జి.హెచ్.ఎమ్.సి. పార్కులో మొక్కలు నాటే కార్యక్రమానికి జర్నలిస్టులు హాజరు కావాలని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.

తెలంగాణ జర్నలిస్టులు, ఆయా పత్రికల సంపాదకులు, ఎలక్ట్రానిక్ మీడియా సి.ఇ.ఓ.లు కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో గల జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. అలాగే ఇదే సమయంలో తెలంగాణలోని వివిధ జిల్లాల టీయూడబ్ల్యూజె నాయకత్వం, జర్నలిస్టులు ఆయా జిల్లాలలో హరిత హారం కార్యక్రమాన్ని తమకు అనుకూలమైన ప్రాంతాలలో నిర్వహించి విజయవంతం చేయాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఒక ఉద్యమ స్థాయిలో నిర్వహించాలని జర్నలిస్టులకు వెల్లడించారు.

- Advertisement -