టి కాంగ్రెస్ నేతలు ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ఊహించడం కష్టం. కొన్ని సార్లువారు చేసే వ్యాఖ్యలు సొంత పార్టీని చిక్కుల్లోకి నేడుతుంది. ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉచిత కరెంట్ పై చేసిన వ్యాఖ్యలు ఏ స్థాయిలో దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. రైతులకు 24 గంటలు కరెంట్ అవసరం లేదని, మూడు గంటలు కరెంట్ చాలని రేవంత్ రెడ్డి ఆ మద్య చేసిన వ్యాఖ్యల చుట్టూ ఇప్పటికీ కూడా హాట్ హాట్ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంచితే తాజాగా సీట్ల విషయంలో ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశం అవుతున్నాయి.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీట్లు ఆశించి ఎవరైనా పార్టీలో చేరాలని భావిస్తే.. ఆ ఆలోచన విరమించుకోవాలని జిల్లాల్లోని 12 స్థానాలు రిజర్వ్ అయిపోయాయని కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు చేరికలకు భంగం కలిగించేలా ఉన్నాయనేది కాంగ్రెస్ లోని ఒక వర్గం భావిస్తోంది. అసలే వర్గపోరు, ఆదిపత్య పోరుతో టి కాంగ్రెస్ నిన్న మొన్నటి వరకు సతమతమైంది. కర్నాటక ఎన్నికల తరువాత వాటన్నిటిని పక్కన పెట్టి నేతలు ఒకే తాటిపైకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read:బీసీల జోలికొస్తే భూస్థాపితం చేస్తాం:శ్రీనివాస్ గౌడ్
అంతే కాకుండా పెద్ద ఎత్తున చేరికలను ఆహ్వానించేందుకు కూడా కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో సీట్లు క్లోజ్ అయ్యాయని కొత్తవాళ్లు పార్టీలోకి చేరాల్సిన అవసరం లేదని కోమటిరెడ్డి చెబుతుండడంతో చేరికలను అడ్డగించే ప్రయత్నంలో కోమటిరెడ్డి ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమతున్నాయి. గతంలో ముంగోడు బైపోల్ సమయంలో కూడా పార్టీ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి షోకాజ్ నోటీసులను కూడా ఎదుర్కొన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పుముకుంటుందనే భావన కలుగుతున్న నేపథ్యంలో చేరికలు వద్దని చెప్పడం కాంగ్రెస్ కు నష్టం కలిగించే అంశమే. మరి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై టి కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read:బేబీపై సుకుమార్ కామెంట్స్!