చెప్పడం మాత్రమే.. చేయడం ఉండదా ? మోడీజీ !

39
- Advertisement -

చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి అల్లరి పనులు అన్నట్లు బిజెపి చెప్పేది ఒకటైతే చేసేది మరోలా ఉంటుంది. తమ పాలనలో మతతత్వ రాజకీయాలకు చోటు ఉండదని చెబుతూనే మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా చేయడం బహుశా కాషాయ పెద్దలకు తెలిసినంతగా మరెవరికి తెలియదేమో. కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు రేపడం దానితో రాజకీయంగా లభ్ది బీజేపీ ఇంటర్నల్. గా కొనసాగిస్తున్న మాస్టర్ ప్లాన్ అనేది జగమెరిగిన సత్యం. గతంలో చెలరేగిన హిజాబ్ వివాదం గాని, ట్రిపుల్ తలాఖ్ వివాదం గాని, ఇప్పుడు మణిపూర్ లో కొనసాగుతున్న అల్లర్లు గాని.. వీటి వెనుక కుల మతాల మద్య రాజకున్న వివాదాలే కారణం అనే సంగతి అందరికీ తెలుసు. .

మరి బీజేపీ సర్కార్ వీటిని పూర్తి స్థాయిలో నోరోధించగలిగిందా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి.. ఎప్పుడో ఎందుకు ఈ మద్య దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మణిపూర్ అంశాన్నే పరిశీలిస్తే..గత ఐదు నెలలుగా రెండు కులాల మద్య రాజుకున్న రగడ చిలికి చిలికి గాలి వానగా మరి మణిపూర్ అట్టుడికిపోతుంది. మరి ఇక్కడ ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరించడం దేనికి సంకేతం. గత కొన్నాళ్లుగా ఇంటర్నెట్ కూడా నిషేదించే పరిస్థితి మణిపూర్ లో ఎందుకు చోటు చేసుకుంది ? ఈ మద్య ఇంటర్నెట్ తిరిగి ప్రారంభం కావడంతో అక్కడి ఉదంతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న వేళ కేంద్రం సైలెంట్ గా ఉండడం వెనుక ఆంతర్యం ఏమిటి ? పార్లమెంట్ లో మణిపూర్ అల్లర్లపై మోడి సర్కార్ ఎందుకు చర్చించలేదు ? ఇలాంటి ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పగలదా ? పైకెమో తమకేలంటి కులమాట భేషాభిప్రాయాలు లేవని చెప్పే మోడి సర్కార్ లోలోపల మాత్రం కులాల మద్య మతాల మద్య చిచ్చుకు కరణమౌతోందా ? ఇలాంటి అనుమానాలు ప్రతి సామాన్యుడిలో మెదులుతున్నాయి.

ఇదిలా ఉంచితే తాజాగా ఆంగ్ల వార్తా సంస్థ పిటిఐ తో ప్రధాని మోడి చేసిన వ్యాఖ్యలు ఒకసారి పలిశీలిస్తే.. భారత్ 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా నిలుస్తుందని చెబుతూ ఇక్కడ అవినీతి, కుల మత తత్వాలకు స్థానం ఉండదని చెప్పుకొచ్చారు. దీంతో మోడీపై రాజకీయ అతివాదులు విమర్శలు గుప్పిస్తున్నారు. మతతత్వ ఏజండాతో ఉన్న బీజేపీ అధినేతనే మతతత్వానికి చోటు లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉండని విమర్శలు గుప్పిస్తున్నారు. తన పాలనలో దేశాన్ని అవినీతిలో ముంచెత్తుతున్న ప్రధానే.. 2047 నాటికి దేశాన్ని అభివృద్ది చేస్తామని చెప్పడం నిజంగా హాస్యాస్పదమే అని సెటైర్స్ గుప్పిస్తున్నారు రాజకీయ అతివాదులు.

Also Read:షర్మిల చూపు తెలంగాణ వైపే!

- Advertisement -