షిండే రాజీనామా..తప్పేటట్లులేదా?

48
- Advertisement -

ఈ మధ్య మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఆ మద్య శివసేన పార్టీకి సంబంధించి ఉద్దవ్ థాక్రే మరియు ఏక్ నాథ్ షిండేలా వ్యవహారం హాట్ టాపిక్ గా నిలిస్తే. ఈ మద్య ఎన్సీపీలో శరత్ పవార్ మరియు ఆ పార్టీ నుంచి షిండే వర్గంలో చేరిన అజిత్ పవార్ లా వ్యవహారం హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. ఎవరు ఊహించని విధంగా అజిత్ పవార్ ఎన్సీపీ నుంచి బయటకు వచ్చి షిండే వర్గంలో చేరి డిప్యూటీ సి‌ఎం పదవి అధిష్టించారు. మరోవైపు అజిత్ పవార్ కారణంగా చీలిక ఏర్పడిన ఎన్సీపీ తీవ్రంగా బలహీన పడింది. దీంతో ఎన్సీపీని బలపరిచేందుకు శరత్ పవార్ ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తాడనేది ఆసక్తి రేపిన ప్రశ్న..

కాగా మొదటి నుంచి విపక్ష కూటమికి మద్దతు ప్రకటిస్తూ వచ్చిన శరత్ పవార్ ఈ మద్య విపక్ష కూటమికి అంటిఅంటనట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. దీంతో శరత్ పవార్ బీజేపీ దోస్తీని కోరుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ సందేహాలకు బలాన్నిస్తూ ఆ మద్య లోక్ మాన్య అవార్డ్ ప్రదానంలో మోడీతో పాటు ఒకే వేధికను పంచుకున్నారు శరత్ పవార్. దీన్ని బట్టి చూస్తే ఎన్డీయేలో చేసేందుకు శరత్ పవార్ సుముఖంగానే ఉన్నారా అనే సందేహాలను వ్యక్తం చేశారు కొందరు విశ్లేషకులు. ఇక తాజాగా ఎన్సీపీలో చీలిక తెచ్చిన అజిత్ పవార్.. శరత్ పవార్ తో భేటీ అయ్యారు.

Also Read:బుక్కైనా జగన్..వాయిస్తున్నా టీడీపీ!

ఈ భేటీ జాతీయ రాజకీయల్లో చర్చనీయాంశంగా మారింది. గత కొన్నాళ్ళుగా మహారాష్ట్ర సి‌ఎం ఎన్ నాథ్ షిండే ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి.. ఆ పదవిని అజిత్ పవార్ కు అప్పగించే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు టాక్ నడిచింది. ఇప్పుడు ఆ దిశగానే వ్యూహరచన మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. షిండేను సి‌ఎం పదవి నుంచి తప్పిస్తే ఎలాంటి రాజకీయ సంక్షోభం తలెత్తకుండా అజిత్ పవార్ ద్వారా శరత్ పవార్ తో బీజేపీ చర్చలు సాగిస్తోన్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ఒకవేళ షిండేను సి‌ఎం పదవి నుంచి తప్పిస్తే ఈసారి ఆ పదవి అధిష్టించేది ఎవరనేది కూడా అంతు చిక్కని ప్రశ్నే. మొత్తానిక్ తాజా పరిణామాలు చూస్తుంటే ఏక్ నాథ్ షిండే సి‌ఎం పదవికి రాజీనామా చేయక తప్పెలా లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:రాజ్యాంగం ఎలా ఏర్పడిందో తెలుసా?

- Advertisement -