ఖాళీ అవుతున్న బీజేపీ..కోలుకోవడం కష్టమేనా?

42
- Advertisement -

తెలంగాణలో బీజేపీ పరిస్థితి రోజు రోజుకు మరింత దిగజారుతోంది. ముఖ్యంగా కర్నాటక ఎన్నికల తరువాత పూర్తిగా డీలా పడిన కమలం పార్టీ.. తిరిగి పుంజుకోకపోగా మరింత బలహీన పడుతుండడం ఆ పార్టీ అధిష్టానాన్ని మరింత కలవరపెడుతోంది. ఈసారి ఎన్నికల్లో విజయం మాదేనంటూ, బి‌ఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని పగటికలలు కన్నా కమలనాథులకు కన్నడ ప్రజలు ఊహించని రీతిలో స్ట్రోక్ ఇచ్చారు.ఆ ఫలితాలు ఇప్పుడు తెలంగాణలో కూడా గట్టిగానే ప్రభావం చూపుతున్నాయి.నేతల్లో నిరుత్సాహం పెరగడం దానికి తోడు పదవుల విషయంలో విభేదాలు తలెత్తడం వంటి పరిణామాలతో పార్టీ మెల్లగా బలం కోల్పోతు వస్తోంది.

ఇక పరిస్థితి చక్క దిద్దెందుకు రంగంలోకి దిగిన అధిష్టానం పదవుల విషయంలో చాలానే మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తప్పించి కిషన్ రెడ్డిని నియమించింది. ఈటెల రాజేందర్ ను ఎన్నికల ప్రచార కమిటీ చైర్మెన్ గా నియమించింది. ఇలా ఎన్ని మార్పులు చేసిన పార్టీ తిరిగి పడడంలేదు. దీంతో పార్టీలో ఇంకా కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని భావిస్తున్న కొంత మంది నేతలు బీజేపీని వీడి ఇతర పార్టీలలో చేరేందుకు సిద్దమౌతున్నట్లు టాక్ నడుస్తోంది. తాజాగా మాజీ మంత్రి సీనియర్ నేత చంద్రశేఖర్ బీజేపీకి రాజీనామా చేశారు.

Also Read:బుక్కైనా జగన్..వాయిస్తున్నా టీడీపీ!

వికారాబాద్ జిల్లా లో కీలక నేతగా ఉన్న చంద్రశేఖర్ ఆ పార్టీని వీడడం నిజంగా గట్టి దేబ్బే. ఇక నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ నియోజిక వర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నేత పొద్దుటూరి వినయ్ కుమార్ కూడా బీజేపీని వీడనున్నట్లు టాక్. ఇక వీరి దారిలొణే టికెట్లు దక్కని మరికొంతమంది నేతలు కూడా బి‌ఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ లో చేరేందుకు మార్గాలు వెతుకుంటున్నారట. దీంతో ఎన్నికల ముందే కమలం పార్టీ ఖాళీ అవుతుందా అనే భయం ఆ పార్టీ నేతలను వేధిస్తోందట. ఏది ఏమైనప్పటికి మరో నాలుగు నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం పార్టీలోని పరిణామాలు కాషాయ పెద్దలను తీవ్రంగా కలవర పెడుతున్నాయి. మరి వలసలను ఆపేందుకు అధిష్టానం ఎలాంటి ప్రణాళికలు వేస్తుందో చూడాలి.

Also Read:రాజ్యాంగం ఎలా ఏర్పడిందో తెలుసా?

- Advertisement -