ఇంతకీ.. అలీ సలహా ఇచ్చింది ఎవరికి..?

249
- Advertisement -

క‌మెడీయ‌న్ అలీ అన‌డం కంటే కాంట్ర‌వ‌ర్సీ అలీ` ఇది ఆయ‌న‌కు బాగా న‌ప్పుతుందేమో! ఎందుకంటే `స‌మంత న‌డుము బెజ‌వాడ బెంజి సర్కిల్‌లా ఉంటుంది.. అబ్బా అనుష్క తొడ‌లు.. అంటూ హీరోయిన్ల‌పై కామెంట్లు చేసి మరింత వివాదాస్ప‌దంగా మారిపోయాడు. వీటిపై తీవ్ర నిర‌స‌న‌లు రావ‌డంతో `ఇక యాంక‌రింగ్ చేయ‌ను` అని చెప్పాడు. ఇక అడపా దడపా ఆడియో ఫంక్షన్లలో కూడా అలీ తన నోటికి పని చెబుతుంటాడు. ఆదివారం సప్తగిరి నటించిన ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ చిత్రం ఆడియో ఆవిష్కరణ కు వచ్చిన అలీ.. సప్తగిరికి ఓ సలహా ఇచ్చాడు.

ఓ కమేడియన్ కు హీరోగా అవకాశం రావడమంటే, లాటరీ తగలడమేనని, దాన్నుంచి వచ్చిన పేరు, ప్రతిష్ఠలను జేబులో ఉంచుకుని ముందుకు పోవాలే తప్ప, మరో చాన్స్ తీసుకుందామని భావిస్తే, ఫలితం ఒకేలా ఉండకపోవచ్చని అలీ అన్నాడు. గతంలో రాజబాబు, రేలంగి నుంచి మధ్యలో బ్రహ్మానందం, ఇప్పుడు తాను, సునీల్ వరకూ కామెడీ చేస్తూ, హీరోలుగా విజయవంతమైన చిత్రాలను చేశామని గుర్తు చేసుకున్నారు. పూర్తిగా హీరోగానే ఉండిపోయే ఆలోచన వద్దనే విధంగా మాట్లాడాడు.

కమెడియన్‌గా సినీరంగంలోకి ప్రవేశించి హీరోలుగా మారినవారు చాలామంది ఉన్నారు. బ్రహ్మానందం, అలీ, వేణుమాదవ్‌ దగ్గర్నుంచి ఇప్పటి సప్తగిరి వరకు ఆ జాబితా చాలా పెద్దదే ఉంది. అయితే సునీల్‌లా వారెవరూ హీరోగా సీరియస్‌ ప్రయత్నాలు చేయలేదు. వారంతా హీరో వేషాలు వేసినా.. కమెడియన్‌ అవకాశాలను వదులుకోలేదు. కామెడియన్‌గానే కెరీర్ మొదలుపెట్టిన అలీ కూడా హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. అందులో యమలీలా లాంటి హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. ఆ తరువాత మళ్లీ కామెడియన్‌గానే మారి తన కామెడి తాను చేసుకుంటున్నాడు. కానీ కమెడియన్‌గా స్టార్‌ స్టేటస్‌ సంపాదించుకున్న సునీల్‌ మాత్రం హీరో అయ్యాక ఆ వేషాలకు దూరం జరిగాడు. దీంతో ఇంతకీ.. అలీ సలహా ఇచ్చింది సునీల్‌కా.. సప్తగిరికా..! అన్న సందేహం సినీ జనాల్లో మొదలైంది.

- Advertisement -