2024లో పవన్‌పై అలీ పోటీ…!

86
- Advertisement -

2024లో జరిగే ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో పోటీ చేయాలని జగన్‌ ఆదేశిస్తే తప్పకుండా పోటీ చేస్తానని ప్రముఖ టాలీవుడ్ నటుడు వైసీపీ నేత అలీ అన్నారు. పవన్‌ కళ్యాణ్‌పై పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. తిరుపతి జిల్లా నగరిలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్ ఆదేశిస్తే ఎవరిపైనైనా పోటీ చేస్తా. పవన్ కల్యాణ్ నాకు మంచి మిత్రుడే.. కానీ, స్నేహం వేరు. రాజకీయాలు వేరు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 175కు 175 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. రాష్ట్రానికి ఎవరు మేలు చేశారో ప్రజలకు తెలుసని అన్నారు. ఇటీవలే నటుడు అలీకి ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరకుండా అలీ వైఎస్సార్‌సీపీలో జాయిన్‌ అయ్యారు. అయితే గత కొంతకాలంగా విరిద్దరి మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. ఈ సందర్భంగా పవన్‌పై అలీ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇద్దరిమధ్యా దూరాన్ని పెంచాయి. అలీపై కూడా పవన్ కొన్ని పరోక్ష విమర్శలు చేశారు. సినిమాల్లో పవన్‌ నటించే సినిమాల్లో అలీ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అలీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇవి కూడా చదవండి…

దేశంలో వైద్య సేవలో 3వ స్థానం…

మంత్రి కేటీఆర్ అరుదైన ఘనత..

బీఆర్ఎస్ సభ..నవశకానికి నాంది

- Advertisement -