దేశంలో వైద్య సేవలో 3వ స్థానం…

18
- Advertisement -

అంధత్వ నివారణ చర్యలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య నిర్వహణలో తెలంగాణ మూడవ స్థానం సాధించిందని ఈ సందర్భంగా తెలంగాణ వైద్య సిబ్బందిని ఇతర సిబ్బందిని కొనియాడారు. తెలంగాణ వ్యాప్తంగా జనవరి 18 నుంచి ప్రారంభమయ్యే రెండో దశ కంటివెలుగు పథకంను సీఎం కేసీఆర్‌ ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభించనున్నారు.

కంటివెలుగు కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 100రోజుల్లో 1.54కోట్లమందికి పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి చెప్పారు. అవసరమైన వారికి రీడింగ్‌ గ్లాసెస్ ఇస్తామన్నారు. ఇందుకోసం దాదాపుగా 30-35 ల‌క్ష‌ల రీడింగ్ గ్లాసెస్‌, 20-25 ల‌క్ష‌ల ప్రిస్క్రైబ్‌డ్ క‌ళ్ల‌జోళ్లు అవ‌స‌ర‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని హ‌రీశ్ రావు పేర్కొన్నారు.

ప్రతి గ్రామంలో కంటి వెలుగు పరీక్షలు నిర్వహించే బృందంలో ఒక వైద్యాధికారి ఒక అప్టోమెట్రిస్ట్ ఇద్దరు కమ్మూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు ఉంటారని…ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1500టీమ్‌లతో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. రోజు ఒక్కో వైద్య బృందం 100 నుంచి 150మందిని పరీక్షిస్తుందని…ఇప్పటికే అన్ని జిల్లాలకు కావాల్సిన మందులు కళ్లద్దాలు చేరాయని మంత్రి వివరించారు. కంటి వెలుగు క్యాంపుల‌కు తప్ప‌నిస‌రిగా ఆధార్ కార్డు తీసుకురావాల‌ని మంత్రి సూచించారు. కంటివెలుగు బృందంలో పనిచేసే వారికి వైద్యారోగ్య శాఖ నుంచి రోజుకు రూ.1000క్యాంపులోని డాక్టర్ల బృందానికి రూ.1500 ఇస్తామని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి…

మంత్రి కేటీఆర్ అరుదైన ఘనత..

బీఆర్ఎస్ సభ..నవశకానికి నాంది

ఒక ఫోటో జీవితాన్నే మార్చేస్తుంది అంటే ఇదేనేమో..

- Advertisement -