లండన్‌లో దీన్ తననా

9
- Advertisement -

లండన్‌లో తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తోన్న ద్విభాషా చిత్రం ప్రారంభమైంది. పవన్‌ కల్యాణ్‌ ‘బ్రో’ చిత్రంలో సాయిధరమ్‌ తేజ్‌ తమ్ముడిగా మంచి మార్కులు కొట్టేశాడు శ్రీనివాస్‌. ‘బ్రో’ చిత్రం తర్వాత శ్రీనివాస్‌ ఫుల్‌ బిజి అయ్యారు. ఈ సినిమాలో శ్రీనివాస్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఏ స్టార్‌ ప్రొడక్షన్స్, ఏబి ఇంటర్‌నేషనల్‌ ఫిలింస్, అనిక ప్రొడక్షన్‌లు సంయుక్తంగా ఈ ‘దీన్‌ తననా’ చిత్రాన్ని హుస్సేన్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాయి. తొలి షాట్‌ను ప్రముఖ నటుడు అలీ, శ్రీనివాస్‌లపై చిత్రీకరించారు. ఈ షెడ్యూల్‌లో పదిరోజుల పాటు షూటింగ్‌ చేసుకుని ఇండియాకి తిరిగి వచ్చేస్తామని దర్శకుడు హుస్సేన్‌ తెలిపారు. త్వరలోనే మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియచేస్తామని చిత్ర యూనిట్‌ తెలిపింది.

Also Read:‘వెయ్ దరువెయ్’..సాయి ఫుల్ ఎనర్జీ

- Advertisement -