వైసీపీలో చేరడం తప్పా..?:పవన్‌కి అలీ కౌంటర్

290
pawan ali
- Advertisement -

తనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు సినీనటుడు అలీ. పవన్ ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటూనే వైసీపీలో చేరితే తప్పేంటని ప్రశ్నించారు. తనను పవన్ ఎప్పుడు జనసేనలోకి ఆహ్వానించలేదన్నారు. నావల్లే చాలామంది లాభం పొందారు కానీ నేను ఎవరి వల్ల లాభం పొందలేదన్నారు.

వైసీపీ తరపున ప్రచారం చేస్తున్న తాను పవన్‌పై తాను ఎలాంటి కామెంట్లు చేయనప్పటికీ.. తనపై పవన్ ఆరోపణలు చేయడం బాధించిందన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలోకి రాక ముందు నుంచే తాను మంచి పొజిషన్లో ఉన్నానని అలీ గుర్తు చేశారు. ఆర్థిక సాయం చేయాలని ఎవర్నీ ఏనాడూ అడగలేదని… అల్లా దయతో బాగున్నాను, ఆకలితో చస్తాను తప్పితే.. వెళ్లి ఎవర్నీ అడగనన్నారు.

మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో పవన్ సినిమాల్లోకి వచ్చారు. కానీ తాను స్వశక్తితోనే ఇండస్ట్రీలోకి వచ్చానని పవన్‌కు అలీ చురకలు అంటించారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు తాను అండగా ఉన్నానని పవన్ అన్నారు. మీరు నాకు ఎలా సాయం చేశారు ? నాకేమైనా డబ్బులిచ్చారా? లేదంటే సినిమాల్లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటే అవకాశాలు ఇప్పించారా? అని ప్రశ్నించారు. నా బంధువుకి జనసేన టికెట్ ఇచ్చానని పవన్ అన్నారు కానీ ఆయనకు ఇవ్వమని తాను అడిగానా పవన్ చెప్పాలన్నారు.

అలీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నానని కానీ తనతో పనిచేస్తానని చెప్పిన అలీ చెప్పకుండానే వైసీపీలోకి వెళ్లారని పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.అలీ చెప్పిన వాళ్లకు టిక్కెట్‌ ఇచ్చినా తనను వదిలి వెళ్లాడని ఆవేదన వ్యక్తంచేసిన పవన్‌…అలీ లాంటివాళ్ల వల్ల మనుషులపై నమ్మకం పోతుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే పవన్‌కి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు అలీ.

- Advertisement -