వింబుల్డెన్ విజేతగా అల్కరాజ్..

52
- Advertisement -

వింబుల్డెన్ విజేతగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించారు కార్లోస్ అల్కరాజ్. దిగ్గజ ఆటగాడు నొవాక్ జోకోవిచ్‌పై ఘన విజయం సాధించి తొలి వింబుల్డెన్ టైటిల్ సాధించాడు అల్కరాజ్. తొలి సెట్‌లో ఓడినప్పటికి 1-6, 7-6(6), 6-1, 3-6, 6-4 తేడాడో జోకోవిచ్‌ను ఓడించి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌ ఏకంగా 4 గంటలా 42 నిమిషాల పాటు సాగింది.

2018 నుంచి వరుసగా నాలుగేళ్లపాటు వింబుల్డన్ టైటిల్ విజేతగా నిలిచాడు జకోవిచ్. అయితే ఐదోసారి కూడా జకోవిచ్ గెలుస్తాడని అంతా భావించినా అల్కరాజ్ రూపంలో చెక్ పడింది.

Also Read:అధికమాసం అంటే ఏంటో తెలుసా?

జొకోవిచ్ గ్రాండ్ల్ స్లామ్ ఫైనల్ చేరడం ఇది 35వసారి కాగా.. వింబుల్డన్ ఫైనల్ చేరడం 9వ సారి. ఇక ఈ విజయంతో పురుషుల వింబుల్డన్ టైటిల్ గెలిచిన మూడో పిన్నవయస్కుడిగా అల్కరాజ్ రికార్డ్ క్రియేట్ చేశాడు.

Also Read:షర్మిలకు నో ఎంట్రీ.. బ్రేకులు వేస్తోందేవరు?

- Advertisement -