డ్రగ్స్ డొంక కదులుతోంది…

205
Akun sabharwal on Hyderabad Drug Racket
- Advertisement -

టాలీవుడ్‌లో క‌ల‌కలం రేపుతున్న డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో శ‌ర‌వేగంగా విచార‌ణ కొన‌సాగుతోంది. ఈ కేసును ఛేదించేందుకు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సభర్వాల్ బృందం క్షేత్రస్ధాయిలో సమాచారాన్ని రాబడుతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన అకున్ సబర్వాల్ ఇండ‌స్ట్రీకి డ్ర‌గ్స్ ఎలా స‌ర‌ఫ‌రా అవుతున్నాయో తెలిసింద‌న్నారు

హైద‌రాబాద్ ను సేఫ్ అండ్ క్లీన్ సిటీగా మారుస్తామ‌న్నారు. ఇంత‌వ‌ర‌కు ఎక్క‌డా డ్ర‌గ్స్ వాడుతున్న స్కూల్ పిల్ల‌ల వివ‌రాల‌ను బ‌య‌ట పెట్ట‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.  డ్ర‌గ్స్ కేసులో మూడో రోజు విచార‌ణ కొన‌సాగుతున్న‌ద‌న్నారు.  నోటీసులందిన వారంతా విచారణకు హాజరవుతున్నారని వీడియో కెమెరాల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో విచారణ సాగుతుందన్నారు విచార‌ణ త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చి ఎవ‌రేం చెప్పినా.. త‌మ వ‌ద్ద వీడియో ఆధారాలున్న‌ట్లు తెలియ‌జేశారు. అంద‌రం క‌లిసి డ్ర‌గ్స్ ముఠా మీద యుద్ధం చేస్తున్నామ‌న్నారు.

Akun sabharwal on Hyderabad Drug Racket
మరోవైపు మూడోరోజు సిట్ అధికారులు నటుడు సుబ్బరాజును విచారించారు.  ఈ సందర్భంగా సుబ్బరాజుపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. మీకు డ్రగ్స్ అలవాటు ఉందా?, పూరీ జగన్నాథ్ తో సన్నిహితంగా ఉంటారా? ,పూరీ ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకున్నారా? ,పూరీతో కలసి బ్యాంకాక్ వెళ్లినప్పుడు ఏ ఫోన్ నెంబర్లు వాడారు? ,అక్కడ ఏం చేశారు? అక్కడ పూరీ విదేశీ నంబర్లు వాడారు… మీకు తెలుసా? ,కెల్విన్ తెలుసా? ,పూరీ ఇంట్లో పార్టీలో ఏం జరిగేది?,మీకు ఎంత మంది ఈవెంట్ ఆర్గనైజర్లు తెలుసు? అనే ప్రశ్నలకు సంధించినట్లు తెలుస్తోంది.

- Advertisement -