కేజీఎఫ్ స్టార్ రవికా సింగ్ అక్షయ్‌తో ఉన్న సంబంధాన్ని ఎట్టకేలకు బయటపెట్టింది. దాదాపు పాతికేళ్ల తర్వాత నటి రవీనాటాండన్ దీనిపై స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…అక్షయ్‌తో వివాహం రద్ధైన క్షణాలను మర్చిపోలేకపోతున్నాను అని తెలిపింది. 1994లో వచ్చిన మెహ్రా సినిమా ద్వారా మంచి జోడిగా బాలీవుడ్ తెరపై కనిపించారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో మా జోడీకి అంతటా ప్రశంసలు లభించాయి.
మేమిద్దరం మంచి రిలేషన్లో ఉన్నాం. వెంటనే నిశ్చితార్థం…బ్రేకప్ వంటివి వెంటవెంటనే జరిగిపోయాయి. కానీ మా నిశ్చితార్థం ఎప్పుడు జరిగిందో గుర్తు లేదు. కానీ ఎందుకు వీడిపోయాం అనే విషయాన్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాని చెప్పుకొచ్చింది. ఆ బ్రేకప్ తర్వాత కొంత కాలం పేపర్ చదవలేదని అని రవీనా వివరించారు. ఇప్పటికీ మేమంతా కలుస్తూనే ఉంటాం. మాట్లాడుకుంటాం. ఎవరి జీవితాలు వాళ్లు జీవిస్తున్నాము.
అయితే అక్షయ్ కుమార్ అంతకు ముందే తన కోస్టార్ ట్వింకిల్ ఖన్నాతో ప్రేమలో ఉన్నారని చెప్పుకొచ్చింది. దీంతో వారు ఇద్దరూ 2001లో వివాహం చేసుకున్నారు. రవీనా మాత్రం అనిల్ అనే వ్యాపారవేత్తతో ఏడుడుగులు వేశారు.
ఇవి కూడా చదవండి…