గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా సాగుతుంది. ఈ కార్యాక్రమంలో 90 సంవత్సరాల వృద్ధ మహిళ మొక్కలు నాటారు. బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఐవీఎఫ్ ఇంటర్‌నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ మహిళా విభాగం ఆధ్వర్యంలో మదర్స్‌డే సందర్భంగా మొక్కలు నాటారు. మదర్స డే సందర్భంగా నాగోల్ అరుణోదయ కాలనీ అక్షయ ఓల్డేజీ హోంను సందర్శించారు. అక్షయ ఓల్డేజీ హోం ఆవరణలో 90సంవత్సరాల వృద్ధ మహిళ రాజమ్మతో కలిసి మొక్కలు నాటారు.
Also Read: సీఎం ప్రధాన సలహాదారుడిగా సోమేష్ నియామకం
ఈ కార్యక్రమంలో ఇంటర్‌నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ తెలంగాణ మహిళా విభాగం ప్రథమ మహిళ ఉప్పల స్వప్న, ఐవీఎఫ్ తెలంగాణ మహిళా విభాగం ప్రెసిడెంట్ చందా భాగ్యలక్ష్మి, జనరల్ సెక్రటరీ ఎం. శైలజ, ట్రెజరర్ భువన, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు గీత గుప్త, పబ్బ స్వప్న, జ్యోతి, అన్నపూర్ణ, అనిత, కళ్యాణి, నళిని, స్వప్న, వాసవి, శ్రీలత, పద్మ మరియు ఐవీఎఫ్ తెలంగాణ మహిళ విభాగం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: టెన్జింగ్ నార్గే..ఎవరెస్ట్ రారాజు