లారెన్స్ దర్శకత్వంలో అక్షయ్‌ కుమార్‌..!

231
kanchana akshay kumar
- Advertisement -

ముని, కాంచ‌న‌, కాంచ‌న‌-2 తో హ‌ర్ర‌ర్ కామెడి చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు రాఘ‌వ లారెన్స్ . హీరోగా, ద‌ర్శ‌కుడిగా ,డ్యాన్స్ మాస్టర్‌గా ఓ సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడు. తాజాగా కాంచ‌న‌-3 అంటూ ప్రేక్షకుల ముందుకువచ్చాడు. రాఘ‌వ లారెన్స్ అందించిన హ‌ర్ర‌ర్ చిత్రాల‌న్ని బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలుగా బాక్సాఫీస్ ని షెక్ చేసిన‌వే. త‌మిళ‌,తెలుగు బాష‌ల్లో ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావొస్తుంది.

తాజాగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నాడు దర్శకుడు రాఘవ లారెన్స్‌. గతంలో ‘కాంచన’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నాడు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ హీరోగా నటించనున్నాడు. తెలుగులో ముని సిరీస్‌తో ఆకట్టుకున్న లారెన్స్‌ బాలీవుడ్‌లో ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.

ఇక ప్రస్తుతం లారెన్స్ తెరకెక్కిస్తున్న కాంచన-3 చిత్రాన్ని తెలుగులో లైట్ హౌస్ మూవీమేక‌ర్స్ LLP బ్యాన‌ర్ పై బి.మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో రాఘ‌వేంద్ర ప్రోడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లో రాఘ‌వ నిర్మాణం లో తెర‌కెక్కించారు. ఏప్రిల్ 18న విడుద‌ల కానుంది.

న‌టీన‌టులు.. రాఘ‌వ లారెన్స్‌, ఓవియా, వేదిక‌, కొవైస‌ర‌ళ‌, క‌భీర్ దుహ‌న్ సింగ్‌, శ్రీమ‌న్‌, దేవ‌ద‌ర్శిని, స‌త్య‌రాజ్‌, కిషోర్ త‌దిత‌రులు,సినిమాటోగ్ర‌ఫి- వెట్రి, స‌ర్వెష్ మురారి,పి.ఆర్‌.ఓ- ఏలూరు శ్రీను,లైట్ హౌస్ మూవీమేక‌ర్స్ ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్,బి.మ‌ధు స‌మ‌ర్పించు,రాఘ‌వేంద్ర ప్రోడ‌క్ష‌న్స్,రాఘ‌వ నిర్మాణం,క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌కత్వం రాఘ‌వ లారెన్స్‌

- Advertisement -