ప‌ల్లెటూరి తాత‌ గెట‌ప్ లో నాగార్జున‌..

316
nagarjuna in different look
- Advertisement -

అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఓ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. డిఫ‌రెంట్ లుక్ లో నాగార్జున ద‌ర్శ‌న‌మిచ్చాడు. భుజాల‌పై ట‌వ‌ల్ వేసుకుని..క‌ళ్ల‌జోడు పెట్టుకుని..తెల్ల‌టి గ‌డ్డంతో ఓ ఫోటొ దిగాడు నాగార్జున‌. ప‌క్క‌న ఓ అమ్మాయితో క‌లిసి ఈ ఫోటోలో క‌నిపిస్తున్నాడు. సోష‌ల్ మీడియాలో ఈ ఫోటోను చూసిన నెటిజ‌న్లు నాగార్జున పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కుర‌పిస్తున్నారు.

Nagarjuna

ఎలాంటి గెట‌ప్ లో అయినా ప్రేక్ష‌కుల‌ను మైమ‌రించే న‌టుడు నాగార్జున అని కామెంట్లు పెడుతున్నారు. అయితే నాగార్జున వేసిన ఈగెట‌ప్ ఏ సినిమ‌లోనిది అని ప్రేక్ష‌కులు ఆలోచిస్తున్నారు. ప్ర‌స్తుతం నాగార్జున శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ మ‌ల్టిస్టార‌ర్ సినిమాలో చేస్తున్నాడు. ఇటివ‌లే ఈసినిమాకు సంబంధించిన టైటిల్ పోస్ట‌ర్ ను కూడా విడుద‌ల చేశారు.

అయితే ఈ చిత్రంలో నాగార్జున‌తో పాటు న్యాచుర‌ల్ స్టార్ నాని కూడా న‌టిస్తున్నారు. అయితే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈపిక్ మాత్రం అంద‌రూ దేవ‌దాస్ చిత్రంలోని దే అనుకుంటున్నారు. అయిఏత ఈ సినిమాలో నాగార్జున డాన్ గా క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. ఇక ఈపిక్ కు ఇప్ప‌టికే చాలా క్రేజ్ ఏర్ప‌డ‌టంతో ఈసినిమాపై భారీ అంచానాలు పెట్టుకున్నారు అభిమానులు.

- Advertisement -