దేవి శ్రీ ద‌ర్శ‌క‌త్వంలో సుకుమార్ యాక్టింగ్.. (వీడియో)

299
dsp, sukumar
- Advertisement -

దేవి శ్రీ ద‌ర్శ‌క‌త్వంలో సుకుమార్ న‌టించాడు..ఇదేంటి అనుకుంటున్నారా అవును ఇది నిజం. దేవి శ్రీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఓ విడియోలో సుకుమార్ న‌టించాడు. అయితే ఇదేదో సినిమానో షార్ట్ ఫిమ్మ్ అనుకోకండి..త్వ‌ర‌లో దేవిశ్రీ ప్రసాద్ అమెరికాలో చేయ‌బోయే సంగీత క‌చేరీ కోసం ఓ ప్రోమో ను త‌యారు చేశారు. అందులో దేవిశ్రీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా..సుకుమార్ న‌టించారు. ప్ర‌స్తుతం ఈవీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

dsp, sukumar

ఈవీడియో హీరోయిన్ స‌మంత విడుద‌ల చేసింది. ఇక ఈవీడియోలో మొద‌ట సుకుమార్ లుంగీలో క‌నిపిస్తాడు. ఆత‌ర్వాత దేవి శ్రీ ప్ర‌సాద్ ను ప‌రిచ‌యం చేస్తాడు. అమెరికా దేశ ప్ర‌జ‌లంద‌రికీ నా విజ్ఞ‌ప్తి. మీ అంద‌రి చెవుల్లో సంగీతాన్ని నిపండానికి మా డీఎస్పీ వ‌స్తున్నాడు.. ఆడిపాడి అల‌రించేస్తాడంతే..మీరంతా రెడీ గా ఉండండి అంటూ సుకుమార్ ఈవీడియోలో చెప్తాడు.

ఇక దేవిశ్రీ ప్రసాద్ భ‌ర‌త్ అనే నేను సాంగ్ తో ఎంట్రీ ఇచ్చి ఓ పాట పాడుతాడు…ఆగ‌స్టు 11వ తేది నుంచి అమెరికాలో జ‌ర‌గ‌బోయే సంగీత క‌చేరిలో దేవిశ్రీ ప్ర‌సాద్ త‌న బృందంతో క‌లిసి వెళ్ల‌నున్నాడు. సంగీత క‌చేరికి ప్రోగ్రాంకు సంబంధించిన వివ‌రాలను ఆ వీడియోలో పొందుప‌రిచారు. ఈప్రోమోతో చాలా బాగా ప్ర‌చారం చేసుకుంటున్నారు దేవిశ్రీప్రసాద్.

- Advertisement -