వారు సినిమాకు మూలస్తంభాలు…

18
- Advertisement -

వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ సందర్భంగా నందమూరి నట సింహాం బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. సక్సెస్ మీట్ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ… అక్కినేని  తొక్కినేని అంటూ వివాదాస్పదంగా మాట్లాడారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్‌ కాకుండా జగన్ ఫ్యాన్స్ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  తాజాగా ఈ వ్యాఖ్యలపై అక్కినేని నాగచైతన్య ఆఖిల్‌ స్పందించారు.

తెలుగు సినిమా రంగంను నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్‌వీ రంగారావు వీరంతా తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు…వారిని అగౌరవపరచడమంటే మనల్ని మనమే కించపరుచుకోవడం అని నాగచైతన్య ఆఖిల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్‌గా మారిపోయాయి.

ఇవి కూడా చదవండి…

మెగాస్టార్ సంచలన నిర్ణయం

పిక్ టాక్ : అందాల విష్ణుప్రియం

ఓటీటీ : ఈ వీక్ కంటెంట్ ఇదే

- Advertisement -