అక్కినేని నటవారసుడు అఖిల్ అక్కినేని, జీవీకే మనవరాలు శ్రియ భూపాల్ ల ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం నిర్వహించారు. శుక్రవారం రాత్రి జీవీకే హౌస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రెండు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వారిలో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఉన్నారు. కాగా అఖిల్-శ్రియల వివాహం రోమ్‌లో జరగనుంది.
వైట్ అండ్ వైట్ పంచెకట్టులో నాగార్జున అదరగొట్టారు. అమల పట్టుచీరలో మెరిసిపోయారు. మరోవైపు అఖిల్, శ్రియ ఇద్దరూ కూడా సంప్రదాయపు వస్త్రధారణలో చక్కగా ముస్తాబయ్యారు. అక్కినేని వారి ఇంట అచ్చ తెలుగు సంప్రదాయం కనువిందు చేసింది. అఖిల్ పెళ్లి తర్వాత ఇక నాగచైతన్య, సమంతల పెళ్లి ఉంటుందని గతంలోనే తెలిపారు.
ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే మనవరాలైన శ్రీయా భూపాల్, అఖిల్‌లు గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరి ప్రేమను అంగీకరించిన ఇరు కుటుంబాలు వారికి వివాహం చేయాలని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీయా భూపాల్ వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్.