రైల్వే,బస్సుల్లో పాతనోట్లకు చెల్లు

228
buy railway, bus tickets
- Advertisement -

రైల్వే,ఆర్టీసీలో పాత నోట్ల కథ ఈ అర్థరాత్రి నుండి ముగియనుంది. పాత 5వందల రూపాయ నోట్లు ఇక రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో చెల్లవు. రైలు, బస్సు ,సబర్బన్, మెట్రో టికెట్ల కొనుగోలుకు శనివారం అర్ధరాత్రి నుంచి పాత రూ.500 నోట్లు చెల్లవని కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది. రైల్వేతో పాటు మెట్రో, సబర్బన్ టికెట్ కౌంటర్లు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల బస్సులు, కౌంటర్లలో పాత 500 నోట్లను అంగీకరించరని కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. డిసెంబర్ 15 వరకూ పాత 500 నోట్లు తీసుకునేందుకు సమయమున్నా… మార్పులు చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. అయితే రైలు ప్రయాణం సమయంలో కేటరింగ్ సేవలకు మాత్రం ఈ నిబంధన వర్తించదని పేర్కొంది.

అయితే ఆ గడువును 5 రోజుల వరకు కుదిస్తూ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో టికెట్లను కొనాలంటే కొత్త నోట్లను వాడాల్సిందే…లేదా చలామణిలో ఉన్న పాత రూ.100,50,20,10 నోట్లను ,నాణేలను వినియోగించుకోవాల్సిందే. పాతనోట్లు చెల్లని నేపథ్యంలో ప్రయాణికులు సహకరించాలని ఆర్టీసీ అధికారులు కోరారు.

ఇదిఇలా ఉండగా డిసెంబర్ 2 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకుల్లో, విమానాశ్రయాల్లో పాత 500 నోట్లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. డెబిట్, క్రెడిట్ కార్డులతో టోల్ చెల్లించవచ్చని, టోల్ రూ. 200 కంటే ఎక్కువుంటే పాత రూ. 500 నోటును అనుమతిస్తారు. డిసెంబర్ 2 అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్‌‌స(ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్) కొనుగోలు చేసి టోల్ చెల్లించవచ్చని, నగదు చెల్లింపులు చేసేవారు… ఆలస్యం కాకుండా చిల్లర దగ్గర పెట్టుకోవాలని సూచించింది.

మరోవైపు 32 రోజులు గడుస్తున్న ప్రజల కష్టాలు తీరడం లేదు. ప్రజలు పనులు మానుకుని బ్యాంకుల ముందు పడిగాపులు కాయాల్సి వస్తోంది. కలలోనైనా ఊహించుండరు ఇలాంటి పరిస్థితి వస్తోందని. ఏటీఎంలు ముందు నో క్యాష్ బోర్డులు చూస్తామని….చిల్లర కోసం చెప్పులరిగేలా తిరుగుతామని ఎవరనుకుంటారు. నెల రోజులుగా ఇవే కష్టాలు ఊపిరి సలపనివ్వడం లేదు. రోజు ఓ యుగంలా గడుస్తోంది.

పెద్ద నోట్లు రద్దై రోజులు గడుస్తున్న కరెన్సీ కష్టాలు పెరుగుతున్నాయే తప్పా ఇంకా తీరలేదు. తెరుచుకోని బ్యాంకులు తరగని క్యూలతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఏటీఎంలు, బ్యాంకులు ఎదుట బారులు తీరుతూనే ఉన్నారు. కొన్ని ప్రాణాలైతే బ్యాంకుల్లోనే పోతున్నాయ్.

- Advertisement -