అఖిల్ కు హీరోయిన్ దొరికేసింది…

589
Akhil Akkineni
- Advertisement -

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మూడు సినిమాలు డిజాస్టర్ గానే మిగిలాయి. దీంతో ఆయన తర్వాతి సినిమాపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక అఖిల్ తర్వాతి సినిమా బొమ్మరిల్లు సినిమా దర్శకుడు భాస్కర్ తో చేయనున్నాడు. ఈసినిమాను అల్లు అరవింద్ బ్యానర్ గీతా ఆర్ట్స్ లో నిర్మించనున్నారు.

కొద్ది రోజుల క్రితమే ఈసినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైనా ఇంకా హీరోయిన్ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. తాజాగా రష్మీక మందన పేరు కన్ఫామ్ అయినట్లు తెలుస్తుంది. ఛలో మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రష్మీక గీత గోవిందం సినిమాతో టాప్ హీరోయిన్ల లిస్ట్ లోకి వెళ్లింది.

రష్మీకకు యూత్ లో మంచి క్రేజ్ ఉండటంతో ఆమెను తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట చిత్రయూనిట్. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ సినిమాలో నటించగా, మహేశ్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించనుంది.

- Advertisement -