భారీగా డబ్బులు వసూలు చేస్తోన్న అక్కినేని హీరో?

413
akhil akkineni
- Advertisement -

అక్కినేని నాగార్జున త‌న‌యుడు అఖిల్ తీసిన రెండు సినిమాలు బాక్సాఫిస్ వ‌ద్ద బోత్తాప‌డ్డాయి. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 3 సంవత్సారాలు గ‌డిచినా ఇంకా ఒక్క హిట్ కూడా రాలేదు. సినిమాలతో విజ‌యం సాధించ‌క‌పోయినా ప‌లు సంస్ధ‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తూ ల‌క్ష‌ల్లో డ‌బ్బులు సంపాదిస్తున్నాడు. అఖిల్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండ‌టంతో చాలా సంస్ధ‌లు అత‌న్ని బ్రాండ్ అంబాసిడ‌ర్ గా తీసుకుంటున్నాయి. ఏదైనా షాపింగ్ మాల్ కానీ, హోట‌ళ్లు కానీ ఓపెనింగ్ ల‌కు వెళ్తూ భారీగానే డ‌బ్బు సంపాదిస్తున్నాడు.

akhil akkineni

అంతేకాకుండా ప‌లు కంపెనీల‌లో యాడ్ లు కూడా చేస్తున్న విష‌మం తెల‌సిందే. ఇక అఖిల్ ఏదైనా ఓపెనింగ్ కు వెళ్తె భారీ మొత్తంలో డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నాడ‌ని స‌మాచారం. ఇటివ‌లే హైద‌రాబాద్ లో ఓ జిమ్ ఓపెనింగ్ కు హాజ‌ర‌య్యాడు ఈ యంగ్ హీరో. అఖిల్ తో పాటు ఈ కార్య‌క్ర‌మానికి హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి కూడా హాజ‌ర‌య్యింది. జిమ్ ఓపెనింగ్ కార్య‌క్ర‌మంలో అఖిల్ ఉన్న‌ది కేవ‌లం 15 నిముషాలు మాత్ర‌మే కానీ తీసుకున్న డ‌బ్బులు మాత్రం చాలా పెద్ద మొత్తంలో తీసుకున్నాడు.

akhil

పావుగంట‌కు అక్ష‌రాల రూ. 8ల‌క్షలు వ‌ర‌కూ వ‌సూలు చేశాడ‌ట ఈ అక్కినేని యువ హీరో. ఇత‌ను హీరో కాకుముందు నుంచే ప‌లు సంస్ధ‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌హ‌రించాడు. ఇక పూర్తి స్ధాయిలో హీరోగా న‌టిస్తున్న‌ప్ప‌టి నుంచి చాలా సంస్ధ‌లు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా చేసుకుంటూ వెళ్తున్నాడు. అఖిల్ సినిమాల్లో విజయం సాధించకపోయినా యాడ్స పరంగా మాత్రం పుల్ క్రేజ్ ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా అఖిల్ కు పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది.

- Advertisement -