ఆరెస్సెస్ మీటింగ్‌.. ప్రణబ్‌కు ఘనస్వాగతం

228
pranab
- Advertisement -

ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘ్ శిక్షా వర్గ (ఎస్ఎస్‌వీ) మూడవ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు నాగ్‌పూర్ చేరుకున్నారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. జూన్‌ 7న ఆర్‌ఎస్‌ఎస్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగే సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నాగ్‌పూర్‌కు చేరుకున్న ప్రణబ్‌కు ఆరెస్సెస్ ప్రముఖులు, కార్యకర్తలు ప్రణబ్ కు స్వాగతం పలికారు.

ఆరెస్సెస్ కార్యక్రమానికి ప్రణబ్ హాజరవడంపై పలువురు కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే తప్పుపడుతున్నారు. ఆరెస్సెస్ ను ఉగ్రవాద సంస్ధగా కాంగ్రెస్ అధ్యక్షడు రాహుల్ గాంధీ వర్ణించారు. అయితే ఆరెస్సెస్ విషయమై ఓ బెంగాళీ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో… అన్నీ విషయాలు నాగ్ పూర్ మీటింగ్ లోనే చెప్పానని ప్రణబ్ తెలిపారు.

గతంలో జయప్రకాష్ నారాయణ్ (జనాతా పార్టీ నేత), ఎన్‌జీ గోరె (ప్రముఖ మరాఠీ సోషలిస్ట్), డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (మాజీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి) వంటి ప్రముఖులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీయేతర కూటమిని ప్రణబ్ ఏర్పాటు చేస్తారని, ప్రణబ్ ఈజ్ బ్యాక్ అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న తరుణంలో ఆయన ఏం మాట్లాడుతారో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

- Advertisement -