ఇటలీలో అఖిల్ పెళ్లి…?

364
Akhil's Wedding in Italy...?
- Advertisement -

అక్కినేని కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఇప్పటికే అక్కినేని నాగచైతన్య…హీరోయిన్ సమంత ప్రేమలో ఉండగా వారు త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. అన్న చైతు కంటే ముందే అఖిల్ వివాహానికి రంగం సిద్ధమైంది. అఖిల్ వివాహన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో ఇటలీలో జరిపేందుకు నిర్ణయించినట్టు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. రోమ్‌లో ఘనంగా వీరిద్దరి పెళ్లి జరగనుంది. ఈ పెళ్లికి ప్రపంచం నలుమూలల నుంచి 600 మంది అతిథులు హాజరవుతారట.

ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తున్న శ్రేయా భూపాల్ తో అఖిల్ పెళ్లి నిశ్చయమైన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిని ఇటలీలో జరిపించేందుకు నిశ్చయించిన నాగార్జున, వివాహ వేదిక ఖరారుపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ‘అఖిల్’ చిత్రం పరాజయం తరువాత సుదీర్ఘ విరామం తీసుకుని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మరో చిత్రం చేసేందుకు అఖిల్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

Akhil's Wedding in Italy...?

అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నటవారసుడు అఖిల్, తన రెండో సినిమాతో పాటు పెళ్లి వార్తలతోనూ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు.

online news portal

ఇదిలా ఉండాగా అఖిల్‌ నిశ్చితార్ధం త్వరలోనే హైదరాబాద్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయనాయకులు,సినీప్రముఖులు హాజరవుతారని సమాచారం. స్టార్‌ హోటల్‌లో అఖిల్‌ ఎంగ్‌జ్‌మెంట్‌ జరగనున్నట్లు  తెలుస్తుంది.

- Advertisement -