పెట్రోల్ ధరల పెంపుపై అఖిలేష్

2
- Advertisement -

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరగడంపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్… కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంధన ధరల పెంపు సామాన్యుడి నడ్డి విరుస్తుంటే, ప్రధాని మోదీ పొదుపు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు.

దేశంలో లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ. 3 మేర ధర పెరగడం పట్ల అఖిలేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలు ముగియగానే ప్రభుత్వం తన అసలు రంగు బయటపెట్టిందని, సామాన్యుల జేబులకు చిల్లు పెడుతోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ ఇటీవల ఇచ్చిన ‘పొదుపు’ పిలుపును ప్రస్తావిస్తూ.. ప్రజలు ఇప్పటికే అన్నింటినీ పొదుపు చేసుకుంటూ కష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు ఇంధన ధరలు పెంచి ప్రజలను మరిన్ని ఇబ్బందులకు గురిచేయడమేనా మీ పొదుపు మంత్రం? అని ప్రశ్నించారు.

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, కేవలం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదల నెపంతో చమురు సంస్థలు ఈరోజు నుంచే పెంచిన ధరలను అమలులోకి తెచ్చాయి. ఈ క్రమంలో ప్రతిపక్ష నేతలు వరుసగా కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Also Read:డైటింగ్ కంటే ఇలా చేస్తేనే మేలు?

ధరల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలని, సామాన్య మరియు మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.

- Advertisement -