పంజాబ్..ప్లేఆఫ్స్ ఆశలు సంక్లిష్టం!

4
- Advertisement -

ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక పోరులో 6 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో పంజాబ్ కింగ్స్ (PBKS) ప్లేఆఫ్స్ అవకాశాలు చేజారి పోయాయి. వరుసగా ఐదో ఓటమిని చవిచూసింది పంజాబ్ .

పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే…తమ తదుపరి లీగ్ మ్యాచ్‌లలో తప్పనిసరిగా భారీ తేడాతో విజయం సాధించాలి. దీనివల్ల వారి పాయింట్లు పెరగడమే కాకుండా నెట్ రన్ రేట్ (NRR) మెరుగుపడుతుంది. కేవలం గెలిస్తేనే సరిపోదు, పట్టికలో పైన ఉన్న ఇతర జట్లు (ముఖ్యంగా 4, 5 స్థానాల్లో ఉన్నవి) తమ తదుపరి మ్యాచ్‌లలో ఓడిపోవాల్సి ఉంటుంది.

ఇతర జట్లు 14 లేదా అంతకంటే తక్కువ పాయింట్ల వద్ద ఆగిపోతే, పంజాబ్ తన మెరుగైన రన్ రేట్ ఆధారంగా నాలుగో స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది.ఈ ఓటమి తర్వాత పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు వెళ్లడం దాదాపు ‘అద్భుతం’ జరిగితేనే సాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read:డైటింగ్ కంటే ఇలా చేస్తేనే మేలు?

- Advertisement -