ఎస్పీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ …మహిళా సాధికారత కోసం ‘స్తీ సమ్మాన్-సమృద్ధి యోజన’ అనే కొత్త పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. సమాజంలో సగం జనాభా అయిన మహిళలను (“ఆధి ఆబాదీ”) శక్తివంతం చేయడమే ఈ పథకం లక్ష్యమని తెలిపారు.
తన అధికారిక ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులో, అఖిలేష్ యాదవ్ ప్రముఖ మహిళలతో పాటు తన భార్య, ఎంపీ డింపుల్ యాదవ్‌తో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. మహిళల స్వేచ్ఛ, భద్రత, హక్కులు, సాధికారత కోసం తమ పార్టీ ఎప్పటికీ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.
కుటుంబం, సమాజం, దేశాన్ని బలోపేతం చేసే మహిళలకు గౌరవం లభిస్తే, వారి గౌరవం, ఆత్మవిశ్వాసం రెండూ పెరుగుతాయి అని ఆయన అన్నారు.పిడిఏ (PDA) సామాజిక కూటమిలో ‘ఏ’ అక్షరం ‘ఆధి ఆబాదీ’ని సూచిస్తుందని, అంటే మహిళలని సూచిస్తుందని అఖిలేష్ తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు సామాజికంగా, ఆర్థికంగా సమాన గౌరవం, అవకాశాలు కల్పించి, స్వయం ఆధారితంగా నిలబడేలా చేయనున్నామని చెప్పారు.
Also Read:రోజూ తినే ఈ స్నాక్స్‌తో మీ ఆరోగ్యం ఖతం!
అదనంగా, ‘సమాజవాది పెన్షన్’ పథకాన్ని మళ్లీ అమలు చేసి మహిళల ఆర్థిక భద్రతను బలోపేతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు.

