ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేసే నైతిక హక్కు లేదా? అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ అంజిరెడ్డి. ప్రజలకు ఆరు గ్యారంటీహామీలు ఇచ్చి.. రెండు యేండ్లు గడుస్తుంది.. అమలు చేయాలని బీజేపీ ధర్నాలు చేస్తే.. పోలీసులతో నిర్భంధాలు విధిస్తారా ?…కనీసం ఈ బడ్జెట్ లో ఆరు గ్యారంటీల అమలుకు పైసా కూడా కేటాయించ లేదు అన్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రశ్నించే గొంతులను గత బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ వ్యవహరిస్తుంది..ఆ రెండు (కాంగ్రెస్, బీఆర్ఎస్ ) పార్టీల విధానం ఒక్కటే ప్రజలను మోసం చేయడమే ..గత బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుంది …అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా సొంత పార్టీ నాయకులే పార్టీ విధానాలు నచ్చక.. రాజీనామాలు చేస్తున్నారు అన్నారు.
Also Read:CSK హాల్ ఆఫ్ ఫేమ్‌గా రైనా
మా నాయకులను, కార్యకర్తలను ఇవాళ పొద్దున్న నుంచి హౌస్ అరెస్ట్ చేశారు…జాతీయ పార్టీకి అధ్యక్షుడు, సీనియర్ నేత అని చూడకుండా మా అధ్యక్షులు రామచంద్రరావుపై పోలీసులు ఇష్టారీతిలో వ్యవహరించారు…అక్రమ అరెస్ట్ లు చేసిన, పోలీసులతో నిర్భంధాలు విధించిన ప్రజల కోసం బీజేపీ పోరాటం చేస్తుంది..ప్రజా పాలనా అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్.. ధర్నాలు చేస్తే అక్రమ అరెస్ట్ లు చేయడం ఎంత వరకు సబబు? అన్నారు.

