గ్రీన్ ఛాలెంజ్‌లో చిన్నిబాబు..ఎంపీ సంతోష్ ప్రశంసలు

38
- Advertisement -

జీవితంలో ఒక్కొక్కరిది ఒక్కో దారి.. అందులో మొక్కలు నాటాలి, నేల బాగుండాలి, ప్రకృతిని కాపాడాలి అనుకునేవారిది అభ్యుదయమైన మనస్తత్వం అందుకోసం వారు ఎంతదూరమైన వెళ్తారు. జీవితంలో ఏం చేయడానికైన సిద్ధపడతారు..అలాంటి వారే ఈ దంపతులు.

తాతయ్య – అమ్మమ్మలు మనవడి చేత మొక్కలు నాటించారు. దీనిని ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు ఎంపీ సంతోష్‌. మొక్కను నాటడం ద్వారా తమ మనవడి పుట్టినరోజును జరుపుకున్న ఈ అద్భుతమైన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. జీవితాన్ని పోషించాలనే వారి ఆలోచనాత్మకమైన అందరికి స్పూర్తి అన్నారు. కేక్ కట్ చేయడం మరియు కొవ్వొత్తి ఊదడం కంటే మొక్కను నాటాలనే ఆలోచన గొప్పదని.. #GreenIndiaChallengeలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు సంతోష్.

Also Read:మళ్ళీ పార్లమెంట్ లోకి రాహుల్..మోడీకి షాక్!

- Advertisement -