అక్కినేని అఖిల్‌తో శ్రీను వైట్ల..!

347
srinu vaitla akhil
- Advertisement -

నీకోసం’ నుండి నేటి ‘ఆగడు’ వరకు వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్నాడు. అవకాశాల కోసం అందరిలానే తిరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటు సక్సెస్ ఫుల్ దర్శకునిగా తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న మిస్టర్ శ్రీను వైట్ల రీసెంట్‌గా చాలాకాలం గ్యాప్ తర్వాత అమర్ అక్బర్ ఆంటోనితో ప్రేక్షకుల ముందుకువచ్చారు.

తాజాగా అక్కినేని అఖిల్‌తో సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు ఈ కామెడీ చిత్రాల దర్శకుడు. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సినిమాలు చేసిన అఖిల్‌కి మంచి హిట్ ప‌డ‌క‌పోవ‌డంతో త‌న నాలుగో సినిమాని విభిన్న క‌థాంశంతో చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌.

అందుకే క్రీడా నేప‌థ్యంతో చేస్తే ప్రేక్ష‌కులు త‌ప్ప‌క ఆద‌రిస్తార‌ని భావిస్తున్న అఖిల్ నాలుగో చిత్రాన్ని స్పోర్ట్స్ జోన‌ర్‌లో చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఈ సినిమా తర్వాత ఐదో సినిమాని శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో చేస్తాడ‌ని టాలీవుడ్ వర్గాల టాక్‌. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు గానీ అఫీషియల్ కన్ఫర్మేషన్‌ వచ్చే వరకు వేచిచూడాల్సిందే.

- Advertisement -