‘మిస్ట‌ర్ మ‌జ్ను’ టీజ‌ర్ అప్ డేట్స్..

258
Mr. Maznu
- Advertisement -

అక్కినేని అఖిల్ ప్ర‌స్తుతం మిస్ట‌ర్ మ‌జ్ను సినిమాలో న‌టిస్తున్నాడు. ఈమూవీకి తొలిప్రేమ సినిమా ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే ఈచిత్రం చాలా వ‌ర‌కూ షూటింగ్ పూర్తిచేసుకుంది. రొమాంటిక్ ల‌వ్ స్టోరీగా ఈమూవీ తెర‌కెక్కుతోంది. అఖిల్ స‌ర‌స‌న హీరోయిన్గా నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది. జ‌న‌వ‌రి 25న ఈమూవీని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు చిత్ర‌బృందం.

majnu

న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఈసినిమా నుంచి ఒక పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. ఇవాళ సాయంత్రం ఆరు గంట‌ల‌కు ఈమూవీ టీజ‌ర్ ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఈచిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిచ‌గా.. బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.

అఖిల్ ఇంత‌కుముందు చేసిన రెండు సినిమాలు విజ‌యం సాధించక‌పోవ‌డంతో ఈమూవీపై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాల‌నే న‌మ్మ‌కంతో ఉన్నాడు అఖిల్. చూడాలి మ‌రి ఈసినిమాతో అయిన అఖిల్ విజ‌యం సాధిస్తాడో లేదా పాత సినిమాల్లాగే నిరాశ‌ప‌రుస్తాడో. త్వ‌ర‌లోనే ఈమూవీ ఆడియో లాంచ్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించనున్న‌ట్లు స‌మాచారం.

- Advertisement -