అఖిల్- బొమ్మరిల్లు భాస్కర్ మూవీ అప్ డేట్..!

516
akhil
- Advertisement -

కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్ ….బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అనే టైటిల్ ఖరారు చేయగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా షూటింగ్‌లకు సడలింపు ఇవ్వడంతో గా జులై నుండి రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొననున్నాడట అఖిల్. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా పాటతో సినిమా షూటింగ్‌ని ప్రారంభించనున్నారట.

ఈ సినిమా పై హీరో అఖిల్‌తో పాటుగా అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. చూడాలి మరి ఈ సినిమాతోనైనా అఖిల్ హిట్ కొడతాడా లేదా వేచిచూడాలి.

- Advertisement -