లక్షా 38 వేలకు చేరిన కరోనా కేసులు..

71
Osmania Hospital Doctors Awareness On Coronavirus

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా 24 గంటల్లో 6977 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 154 మంది మృతిచెందారు.

ఇక దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,38,845కి పెరిగింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 77,103 యాక్టివ్‌గా ఉండగా, 57,720 మంది బాధితులు కోలుకున్నారు.

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర మొదటిస్ధానంలో ఉంంది. ఇప్పటివరకు 50231 కేసులు నమోదుకాగా 1635 మంది మరణించారు.

గుజరాత్‌లో ఇప్పటివరకు 14,056 కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ 13,418 కేసులు, రాజస్థాన్‌ 7,028 పాజిటివ్‌ కేసులు, మధ్యప్రదేశ్‌ 6,665, ఉత్తరప్రదేశ్‌ 6268 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.