ఓటీటీలోకి అఖండ..!

66
nbk

బాలయ్య- బోయపాటి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ. రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్ల ప్రవాహం పారిస్తోంది. అఖండ హిట్‌తో బాలయ్య జోష్‌లో ఉండగా ఫ్యాన్స్‌కి మరింత జోష్ నింపారు మేకర్స్‌.

అన్నివర్గాల ఆడియన్స్ మెచ్చిన ది బెస్ట్ మూవీగా నిలిచిన ‘అఖండ’ త్వరలోనే ఓటీటీలో ప్రసారం కాబోతోందనే ప్రచారం ఊపందుకుంది. బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్‌ బస్టర్‌గా దూసుకుపోతున్న ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలనే డిసీజన్‌తో ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారట. 2022 కొత్త సంవత్సరం కానుకగా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారట. డిస్ని హాట్ స్టార్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారని టాక్. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

విడుదలైన ఆరు రోజుల్లోనే 85 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా శ్రీకాంత్ నటించగా పూర్ణ,జగపతి బాబు కీలకపాత్ర పోషించారు.