కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి:ఏకే ఖాన్

222
shanker naik
- Advertisement -

ప్రజలు కరోనా రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలే తీసుకోవాలన్నారు మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారు ఏకే ఖాన్. సికింద్రాబాద్ లీ ప్యాలెస్ రాయల్ గార్డెన్ లో హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్, సఫా బైతుల్ మాల్, యాక్సెస్ ఫౌండేషన్, ఎస్డీఐఎఫ్ స్వచ్ఛంద సంస్థలకు చెందిన నామమాత్రపు, సబ్సిడీ ఛార్జీలతో నడిచే అంబులెన్స్ లు, రోగులను తరలించే వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఏకే ఖాన్….ప్రపంచంలో ఎంతో మంది కరోనా బారిన పడుతున్నారు…ప్రస్తుత పరిస్థితుల్లో అంబులెన్స్ లు ఎంతో కీలకం
అన్నారు. ప్రజలు బంధువులు చనిపోయినా స్మశానానికి వెళ్లాలంటే భయపడుతున్నారని తెలిపారు.ఈ విధంగా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి అంబులెన్స్ లు, శవ తరలింపు వాహనాలు ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.

కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అవసరమైన వారికి నామమాత్రపు ధరలో.. డబ్బులు చెల్లించలేని వారికి ఉచితంగా అంబులెన్స్ సౌకర్యం కల్పించడం ఎంతో ఉపయోగకరం అన్నారు. మరింత మంది ఇలాంటి సేవలు అందించేందుకు ముందుకు రావాలి ముందుగా ప్రజలు కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

- Advertisement -