సీఎం కేసీఆర్‌ని కలిసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్…

314
kcr
- Advertisement -

మహబూబాబాద్ జిల్లా మాల్యాల గ్రామంలో కృషి విజ్ఞాన్ కేంద్రం (KVK) కి అనుసంధానంగా హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ని మంజూరు చేయాలని మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కోరారు.

గురువారం హైదరాబాద్ లో ఆయన సీఎం కేసీఆర్ ను కలిశారు. మల్యాల కేవీకే కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వీసీ జె.రఘోత్తం రెడ్డి 160 ఎకరాల భూమిని, రూ.1 కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారని సీఎంకు ఎమ్మెల్యే వివరించారు. దీనికి అనుసంధానంగా హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీని మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు.

నాలుగురోజుల క్రితం రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి కేవీకేను సందర్శించి, నివేదిక కూడా ఇచ్చారని గుర్తు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్.. వచ్చే విద్యా సంవత్సరం నుంచే హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీని ప్రారంభిద్దామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -