అవును, నిజంగా విలక్షణ స్టారే !

70
- Advertisement -

అజిత్ కుమార్.. స్టార్ మాత్రమే కాదు, అంతకు మించి. బహుశా అజిత్ లాంటి వైవిధ్యమైన స్టార్ హీరో ఇండియన్ స్క్రీన్ పై మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. మరి ఈ విలక్షణ స్టార్ హీరో నుంచి నేడు తెగింపు అనే ఒక సినిమా వచ్చింది. యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయినా తమిళనాడులో తెగింపు సినిమాకి భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. రికార్డులు బద్దలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అజిత్ కుమార్ ఓ తమిళ ఛానెల్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన సినిమాల గురించి బోలెడు విషయాలు చెప్పాడు.

అజిత్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఈ తెగింపు సినిమానే కాదు, నా ప్రతి సినిమాను నేను మొదటి రోజే థియేటర్ కి వెళ్లి చూడాలనుకుంటాను. కానీ వెళ్లను. కారణం ఒక్కటే. హేయ్.. హీరో అజిత్ థియేటర్ కి వచ్చాడట అని జనానికి తెలిస్తే, వారి ఫోకస్ మొత్తం నావైపు మారిపోతుంది. స్క్రీన్ చూడకుండా జనాలు వెనక్కి తిరిగి నా వైపు చూడడం మొదలు పెడతారు. ప్రేక్షకులను నేను డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. అందుకే, రిలీజైన 10-20 రోజుల తర్వాత నేను థియేటర్ కి వెళ్తాను’ అంటూ అజిత్ కుమార్ తాను మూవీ చూడటం పై కామెంట్స్ చేశాడు.

ఐతే, అజిత్ కి అసలు ఏం పట్టవు అని, ముఖ్యంగా అజిత్.. హిట్లు ప్లాప్ లు అస్సలు పట్టించుకోడు అని రూమర్స్ ఉన్నాయి. ఈ విషయం గురించి అజిత్ క్లారిటీ ఇచ్చాడు. తన సినిమా రిజల్ట్ గురించి తను ఎప్పుడూ ఆలోచించను అన్నాడు అజిత్. తాను చేసిన పాత్రకు న్యాయం చేశామా లేదా అనేది మాత్రమే చూస్తానని, కమర్షియల్ లెక్కలు చూడనని అజిత్ క్లారిటీ ఇచ్చాడు. నిజమేఅజిత్, నిజంగా విలక్షణ స్టారే. మొత్తానికి అజిత్ కుమార్ తెగింపు ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -