ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ చలనచిత్రోత్సవం ముగింపు వేడుకల్లో బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన అందచందాలతో మరోసారి అందరినీ కట్టిపడేశారు. తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి ఈ వేడుకలకు హాజరైన ఐశ్వర్య.. రెండవ లుక్‌లో పౌడర్ పింక్ కలర్ గౌనులో మెరిసిపోయారు.
కేన్స్ రెడ్ కార్పెట్‌పై మొదటి లుక్‌లో బ్లూ కలర్ గౌనుతో సంచలనం సృష్టించిన ఆమె, ఆ తర్వాత విందుకు హాజరయ్యేందుకు ధరించిన ఈ పింక్ గౌనులో అత్యంత హుందాగా, ఎలిగెంట్‌గా కనిపించారు. ఈ వేడుకలో ఐశ్వర్యతో పాటు ఆమె కుమార్తె ఆరాధ్య బచ్చన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆరాధ్య ఒక అందమైన ఎరుపు రంగు గౌనుతో పాటు దానికి నప్పే డ్రమాటిక్ కేప్ (భుజాలపై నుండి జారే వస్త్రం) ధరించి కెమెరాలకు ఫోజులిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నుండి ఐశ్వర్యరాయ్, ఆరాధ్యలకు సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇంటర్నెట్‌లో ఈ తల్లీకూతుళ్ల జోడీపైనే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆరాధ్య గత కొన్ని సంవత్సరాలుగా తన తల్లితో కలిసి కేన్స్‌కు వస్తున్నప్పటికీ.. ఆమె అధికారికంగా రెడ్ కార్పెట్‌పైకి ఎంట్రీ ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
Also Read:Keralam:సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు

