ఆర్‌సీబీ ఓడినా.. విరాట్ రికార్డు!

1
- Advertisement -

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో శుక్రవారం జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యక్తిగతంగా పెద్దగా రాణించలేకపోయినప్పటికీ.. టీ20 క్రికెట్‌లో ఒక అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 11 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో 256 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆర్‌సీబీ 55 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.

కోహ్లీ త్వరగానే అవుట్ అయినప్పటికీ, వెంకటేష్ అయ్యర్ (19 బంతుల్లో 44 పరుగులు)తో కలిసి పవర్‌ప్లేలో చెలరేగి ఆడాడు. ఈ క్రమంలోనే ఆర్‌సీబీ కేవలం 3.5 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును దాటింది. ఈ భాగస్వామ్యంతో విరాట్ కోహ్లీ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు యాభై లేదా అంతకంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాల్లో (50+ Partnerships) పాలుపంచుకున్న ఆటగాడిగా విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ (210) రికార్డును కోహ్లీ అధిగమించాడు.

పురుషుల టీ20 క్రికెట్‌లో అత్యధిక 50+ భాగస్వామ్యాల్లో ఉన్న బ్యాటర్లు.. విరాట్ కోహ్లీ: 211 సార్లు,అలెక్స్ హేల్స్: 210 సార్లు,డేవిడ్ వార్నర్: 200 సార్లు,బాబర్ ఆజం: 196 సార్లు,క్రిస్ గేల్: 191 సార్లు ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. అభిషేక్ శర్మ (56), ఇషాన్ కిషన్ (79), హెన్రిచ్ క్లాసెన్ (51), నితీష్ రెడ్డి (29)ల మెరుపు బ్యాటింగ్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 255 పరుగుల భారీ స్కోరు సాధించింది.

Also Read:Keralam:సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు

- Advertisement -