జియో వచ్చిన తర్వాత ఇతర టెలికాం సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్ అయిన ఎయిర్‌టెల్ సంస్థ తన వినియోగదారులను కోల్పోకుండా ఉండేందుకు జియో కంటే ఉత్తమ ఆఫర్లు ఇచ్చేందుకు యత్నిస్తోంది.
నూతన సంవత్సరం సందర్భంగా జియో కొన్ని ప్లాన్లపై రూ. 60 తగ్గించింది, మరికొన్నింటిపై అదనపు డేటా పెంచింది. ఈ నేపధ్యంలో ఎయిర్‌టెల్ కూడా తన ప్రీపెయిడ్ ప్లాన్లను మార్పు చేసింది. రూ.448, రూ.509 ప్లాన్లలో కాలపరిమితితో పాటు అదనపు డేటాను పెంచింది. రూ.448 ప్లాన్‌పై ప్రస్తుతమున్న 70 రోజుల కాలపరిమితిని 82రోజులకు పెంచింది. ప్రస్తుతమున్న 70జీబీ డేటాని, 82జీబీకి సవరించింది.
అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు యథావిథిగా వర్తిస్తాయి. రూ.509 ప్లాన్‌లో ఉన్న 84 రోజుల కాలపరిమితిని 91 రోజులకు పెంచింది. అంతేకాదు ఈ ప్లాన్‌లో 84 జీబీ డేటాని, 91 జీబీ డేటాకు సవరించింది. రూ.448లో ఉన్న సదుపాయాలే ఈ ప్లాన్‌లోనూ వర్తిస్తాయి.