జియో దెబ్బకు ఇతర టెలికాం సంస్థలు పోటీ పడి మరి ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. బీఎస్ఎన్‌ఎల్ రూ.999 ప్యాక్‌తో అన్ లిమిటెడ్ డేటా,కాలింగ్ సౌకర్యం తీసుకురాగా ఎయిర్ టెల్ వరుస ఆఫర్లతో కస్టమర్లను సర్‌ప్రైజ్ చేస్తోంది. ముఖ్యంగా జియోని టార్గెట్ చేస్తూ కొత్త రిచార్జ్ ప్లాన్‌లను ప్రకటిస్తోంది.
ఇప్పటికే జియో అందిస్తున్న రూ. 99 ధీటుగా రూ.93లకే 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ (లోకల్,ఎస్టీడి & రోమింగ్) మరియు ప్రతిరోజూ 100ఎస్ఎంఎస్ లు పొందుతారని ప్రకటించింది. తాజాగా మరో ఆఫర్‌ని వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది.
ఎంట్రీ-లెవల్ 9 రూపాయల రీఛార్జ్ ప్యాక్‌తో ఒకరోజు అపరిమిత వాయిస్ కాల్స్‌ను వినియోగదారులకు అందించనున్నట్టు ఎయిర్‌టెల్ పేర్కొంది. అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్‌తో పాటు అదనంగా రోజులో 100 ఎస్‌ఎంఎస్‌లను, 100 ఎంబీ డేటాను వినియోగదారులు వాడుకోవచ్చు. రిలయన్స్ జియో రూ.19 ప్లాన్‌కు కౌంటర్‌గా ఎయిర్‌టెల్ ఈ రూ.9 రీఛార్జ్ ప్యాక్‌ను తీసుకొచ్చింది.
ఎయిర్ టెల్ మొబైల్ అప్లికేషన్ లేదా వెబ్‌సైట్ ద్వారా కస్టమర్లు ఈ రూ.9 ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు బీఎస్‌ఎన్‌ఎల్,ఐడియా సైతం జియో,ఎయిర్‌టెల్‌కు పోటీగా కొత్త ప్లాన్‌లను ప్రవేశ పెడుతు వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.