మనసుకి నచ్చిన… త్రిదా

260
- Advertisement -

నిఖిల్.. సూర్య vs సూర్య సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన బ్యూటీ త్రిదా చౌదరి. ఈ సినిమాలో టీవీ యాంకర్ పాత్ర పోషించిన త్రిదా మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా మంజుల దర్శకత్వంలో మనసుకి నచ్చింది సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది త్రిదా. తన గ్లామర్‌ షోతో సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ తీసుకొచ్చింది. ఈ సినిమాలో త్రిదా లుక్స్‌కి ప్రేక్షకులు పడిపోయారు.

Manasuku Nachindi Fame Tridha Choudhury Updates

మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది. నటి అన్నాక అన్ని రకాల పాత్రలు చేయడానికి సిద్దంగా ఉండాలని…అవసరమైతే బికినీ వేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతోంది.అంతేకాదు గ్లామరస్ ఫీల్డ్‌లో గ్లామర్‌ని ప్రదర్శిస్తే తప్పేంటని ప్రశ్నిస్తోంది.

స్వతహాగా డాన్సర్‌ అయిన త్రిదా..ఛాన్స్ వస్తే తానేంటో నిరూపించుకునేందుకు సిద్దమని చెబుతోంది. ప్రస్తుతం తెలుగుతో పాటు బెంగాలీ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ..వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ మెప్పిస్తోంది.

- Advertisement -