కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతి

130
sonia
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,ట్రబుల్ షూటర్‌ అహ్మద్ పటేల్ కరోనాతో మృతి చెందారు. అక్టోబర్ 1న కరోనా బారీన పడిన ఆయన అప్పటినుండి గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. అయితే పరిస్ధితి విషమించడం,చికిత్సకు ఆయన అవయవాలు సహకరించకపోవడంతో ఇవాళ ఉదయం 3.30 గంటలకు మృతి చెందారు.

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాంగాధీకి సుదీర్ఘకాలం రాజకీయ సలహాదారుగా పనిచేశారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. గుజరాత్‌ నుంచి పలుమార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన మొదటిసారిగా 1977లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1989 వరకు మూడుసార్లు ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించారు. 1993 నుంచి రాజసభ్య సభ్యునిగా కొనసాగుతున్నారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోడీ,సోనియా,రాహుల్,ప్రియాంక గాంధీ విచారం వ్యక్తం చేశారు.

- Advertisement -