టాలీవుడ్‌కి సరికొత్త అందాల ‘నిధి’..!

221
- Advertisement -

నిధి అగర్వాల్.. గతేడాది మున్నా మైఖేల్ చిత్రంలో టైగర్ ష్రాఫ్ సరసన హిందీలో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది తెలుగు తెరకు కూడా పరిచయం అవుతుంది. నాగచైతన్య నటిస్తున్న ‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగులోకి అడుగు పెట్టి తన టాలెంట్‌తో ఇక్కడి వారిని మంత్ర ముగ్దుల్ని చేసింది… ఇటీవలే విడుదలైన ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌కి మంచి పేరు రాగా తన అద్వితీయ నటనతో అందరిని ఆకట్టుకుంది.

Nidhhi Agerwal

చిత్రంలో తన పాత్రకు వంద శాతం న్యాయం చేకూర్చగా డాన్స్ అభినయంతో సినిమాలో తనే హైలైట్‌గా నిలిచింది.. తొలి చిత్రంతోనే అందరిని ఆకట్టుకున్న ఈమెకి స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలున్నాయని ప్రేక్షకులు అంటున్నారు. బాలీవుడ్‌లో తనదైన మార్క్ వేసుకున్న ఈ సన్నజాజి టాలీవుడ్‌లోనూ అదే రీతిలో రాణించి బడా హీరోయిన్‌ల లిస్టులోకి వెళ్లాలని ప్రేక్షకులు కోరుతుండగా ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాలు చూస్తే అదేమంత దూరంలో ఉన్నట్లు కనిపించడం లేదు.

ఈ చిత్రంతో పాటు అఖిల్‌ ‘మిస్టర్ మజ్ను’ చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. వరుసగా ఇద్దరు అక్కినేని హీరోల సినిమాలు చేస్తున్న ఈ అక్కినేని వారి భామకి ఇతర హీరోల సినిమా హీరోల దగ్గరనుండి కూడా ఆఫర్స్ వస్తున్నాయట.. మరి టాలీవుడ్ అందాల నిధి గ్లామర్ మెరుపులు వెండితెరపై త్వరలో చూడొచ్చన్నమాట.

- Advertisement -