ఉగ్రదాడి నుంచి తృటిలో తప్పించుకుంది..!

221
After Manhattan Attack, Priyanka Chopra tweets
- Advertisement -

ఉగ్రదాడి నుంచి హీరోయిన్‌ ప్రియాంక చోప్రా బయటపడ్డారు. ఉగ్రమూకల దాడులు తమ ఇంటికి దగ్గరలోనే జరగడం వల్ల ప్రియాంక హడలిపోయింది. ఎనిమిది మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయేలా చేసిన ట్రక్కు బీభత్సం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

తాజాగా తాను నివసిస్తున్న అపార్టుమెంటుకు కేవలం ఐదు బ్లాకుల దూరంలోనే  ఈ ఘటన జరిగిందని ఆమె ట్వీట్ చేశారు.

 After Manhattan Attack, Priyanka Chopra tweets it happened near her New York residence

‘నేను హాలీవుడ్‌ టీవీ సీరియల్‌ క్వాంటికో -3 సిరీస్‌ షూటింగ్‌ ముగించుకుని ఇంటికి వస్తున్నాను. మా ఇంటి దగ్గర అంతా గొజవ గొడవగా ఉంది. సైరన్ల మోత.. ఎటు చూసినా పోలీసులు.. నేను చాలా భయపడిపోయాను. నాకు అప్పడే తెలిసింది ఇప్పుడే ఇక్కడ ట్రక్కు దాడి జరిగింది అని. ఆ చప్పుడు ప్రస్తుతం ప్రపంచమున్న పరిస్థితి తెలుపుతోంది. అని ఆమె ట్వీట్ చేశారు. ఈ ఘటనలో చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆమె ప్రార్థించారు.

- Advertisement -