“సింహం” వేట మొదలైంది…

313
- Advertisement -

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న‌ 102వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత  సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున విషయం తెలిసిందే. బాలకృష్ణ సరసన నయనతార, నాటాషా జోషీ, హరిప్రియలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి “జై సింహా” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇవాళ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.

ఫస్ట్ లుక్‌లో బాలయ్య మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. పోస్టర్‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని హైలెట్ చేస్తూ వేలాది మంది ఆ విగ్రహాం చుట్టు ధర్నా చేస్తున్నట్లు డిజైన్ చేశారు. బాలయ్య లుక్‌ ఫ్యాన్స్‌ని తెగ ఆకట్టుకుంటోంది. సింహాం వేట మొదలైంది అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

NBK102 Jai Simha First Look

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12, 2018న విడుదల చేయనున్నారు. ఇటీవలె వైజాగ్ బీచ్ రోడ్ లో 5000 వేల జూనియర్ ఆర్టిస్టులు, 110 బస్సులతో “మహా ధర్నా” సీక్వెన్స్ షూటింగ్ జరిగింది. ఇక ఇదే షెడ్యూల్ లో బాలకృష్ణ-హరిప్రియలపై ఓ రోమాంటిక్ సాంగ్ తోపాటు, బాలయ్యపై ఓ మాంటేజ్ సాంగ్ ను షూట్ చేశారు.

బాలకృష్ణ, నయనతార, న‌టాషా దోషీ,  ప్రకాష్ రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి,  ప్రభాకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: ఎం.రత్నం, కళ: నారాయణ రెడ్డి, పోరాటాలు: అరివుమణి-అంబుమణి, సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, సహ-నిర్మాత: సి.వి.రావు, ఎద్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వరుణ్-తేజ, నిర్మాణం: సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్!

- Advertisement -