ఆదిపురుష్ చూశాక ఆశ్చర్యపోతారు:శరద్

52
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ నటించిన సినిమా ఆదిపురుష్. భారీ అంచనాల మధ్య జూన్‌ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా ఈసినిమాకు సంబంధించి ప్రభాస్‌కు హిందీ డబ్బింగ్ చెప్పిన శరద్ కేల్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆదిపురుష్ సినిమా అద్భుతంగా ఉందన్నారు. తెలుగు హీరోలకు హిందీ సినిమాలకు డబ్బింగ్ చెప్పడంతో శరద్ కేల్కర్ టాలీవుడ్‌ వాళ్లకు సుపరిచితమయ్యారు.

ఈ సందర్భంగా ఆదిపురుష్‌ సినిమా గురించి మాట్లాడుతూ…నేను డబ్బింగ్‌లో భాగంగా ఆదిపురుష్ చూశాను. చాలా బాగుంది. తుది మెరుగులు దిద్దాక అందరూ ఆశ్చర్యపోతారు. సినిమాలోని కంటెంట్ దాన్ని తెరకెక్కించిన విధానం అన్ని అద్భుతంగా ఉన్నాయి. డబ్బింగ్ పూర్తయ్యక ప్రభాస్‌ను కలిశాను. నన్ను ఆప్యాయంగా హత్తుకున్నారు. చాలా బాగా చెప్పావని కితాబిచ్చారు. అదే నాకు ప్రభాస్ ఇచ్చిన గొప్ప బహుమతి అని చెప్పుకొచ్చారు. తన గొంతు ప్రభాస్‌కు సరిపోతుందని తొలుత రాజమౌళి గుర్తించారని అన్నారు.

Also Read: అప్పటి ముచ్చట్లు : ఆమెను చూసి చలించిపోయారు

ఇటీవల విడుదల నాని దసరాకు కూడా నేనే డబ్బింగ్ చెప్పానని అన్నారు. ఆ సమయంలో నాని ప్రతి సన్నివేశం గురించి వివరించేవాడని ఆయన అన్నారు. రామాయణం ఆధారంగా భారీ బడ్జెట్‌తో ఓంరౌత్ రూపొందించిన ఈ సినిమాలో సీతగా కృతిసనన్‌, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావాణాసురుడిగా సైఫ్, హనుమంతుడిగా దేవదత్త నాగే నటించారు.

Also Read: Nani:’మేమ్‌ ఫేమస్‌’ బాక్సాఫీస్‌ బెండ్‌ తీస్తుంది

- Advertisement -