గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన అదిలాబాద్ ఎస్పీ

340
sp
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించారు అదిలాబాద్ ఎస్పీ విష్ణు వారియర్. ఆదిలాబాద్ ఏ ఆర్ హెడ్ క్వాటర్స్ లో సిబ్బందితో కలిసి మూడు మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. 33% అడవులు ఉండాల్సిన మన తెలంగాణా లో 23% మాత్రమే ఉన్నాయి.. మిగిలిన 10% అడవులు కావాలంటే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. హైదరాబాద్ లాంటి మహానగరం చుట్టూ కొన్ని వేల ఎకరాల్లో పార్కులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముప్పై సంవత్సరాల తరువాత రాబోయే పర్యావరణ ఇబ్బందులను ముందుగా పసిగట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పార్కులు ఏర్పాటు చేయడం, అడవులను పెంచడం ఆయన దూరద్రుష్టికి నిలువుటద్దం అన్నారు.

Sp Vishnu

పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ చేస్తున్న కృషి అభినందనియమని తెలిపారు. మొక్కలు పెంచడంతో పాటు వాటి ఎదుగుదల పైన శ్రద్ద చూపడం చాలా ముఖ్యమైన విషయం. మొక్కలు పెట్టడం ఫోటోలకు పరిమితం కాకుండా వాటి ఫలితాలు పొందే విదంగా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని కోరారు. తాను వ్యక్తి గతంగా పర్యావరణ ప్రేమికుడినన్నారు తాను పదివేల మొక్కలు నాటి ఎనిమిది వేల మొక్కలు ఎదిగేందుకు వాటిపైన చూపే ప్రత్యేక శ్రద్దే కారణం అన్నారు . గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మరో ముగ్గురికి సవాల్ విసిరారు. ఉట్నూర్ ఏఎస్పీ శబరిష్ , పిఓ ఐటీడీఏ ఉట్నూర్ కృష్ణా ఆదిత్య , డీఏఫో ప్రభాకర్ రెడ్డి ఆదిలాబాద్ లకు సవాల్ విసిరారు.

- Advertisement -